NRI-NRT

సింగపూర్ TCSS ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

సింగపూర్ TCSS ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పూజ మరియు పంచాంగ శ్రవణం 13 ఏప్రిల్ న ఆన్లైన్ లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ప్రధాన ఆకర్షణ గ నిలిచాయి. మన పండుగల ను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందు కు ఎంతో సంతోషం గ ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత మరియు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS అధ్యక్షులు నీలం మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మొదలగు వారు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ సంబురాలను ఆన్లైన్ లో వందలాది మంది వీక్షించారు.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జూలూరి సంతోష్ కుమార్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, నంగునూరి సౌజన్య మరియు శివ ఆవుల వ్యవరించారు.

ఈ సందర్భంగా సొసైటీ సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజాపూర్, శశిధర్ రెడ్డి మరియు కాసర్ల శ్రీనివాస్ గార్లు సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహయ సహకారాలు అందించిన దాతలు విజయ మోహన్ వెంగళ, నవీన్ కుమార్ గౌరిశెట్టి, డార్విన్ బైస, చామిరాజ్ వెంకట రామాంజనేయులు మంచికంటి స్వప్న శ్రీధర్ తదితరులకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సింగపూర్ TCSS ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు - TCSS Singapore Ugadi 2021 Celebrations