DailyDose

విశాఖలో ఎన్నారై కుటుంబం ఆత్మహత్య?-నేరవార్తలు

విశాఖలో ఎన్నారై కుటుంబం ఆత్మహత్య?-నేరవార్తలు

* ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి: విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి..మృతులు :బంగారు నాయుడు(50) .నిర్మల(46).దీపక్(22)కశ్యప్ (19).మధురవాడ మిధిలపురి కాలనీలోని ఆదిత్య టవర్స్ లో ఘటన …అపార్ట్మెంటు 5వ అంతస్తులో కుటుంబం అనుమానాస్పద మృతి ….8 నెలల క్రితం అపార్ట్మెంట్లో కి వచ్చిన ఎన్నారై కుటుంబం…వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

* పెడవేగి మండలంలో లక్షలాది రూపాయల విలువ చేసే విలువైనఆదరణ పథకం పనిముట్లు గల్లంతయ్యాయి.2018 లో మంజూరైన సైకిళ్ళు.కుట్టు మిషన్ లు.వాషింగ్ మిషన్ లు.బార్బర్ షాపులలో ఉపయోగించే కుషన్ కుర్చీలు.పశువుల మేత కట్టర్లు. నేటికి లబ్దిదారుల చేతికి రాలేదు.ఆ పనిముట్లలో కొన్ని సైకిళ్ళు.వాషింగ్ మిషన్ లు .కుర్చీలను మండల పరిషత్ కార్యాలయం లో పనిచేసే ఒక ఉద్యోగి దొడ్డి దారిలో అమ్మేసి సొమ్ముచేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మండలం లో ఆదరణ పథకం కు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.ఎంతమందికి మంజూరైంది.మంజూరైన యూ నిట్లు లో సైకిళ్ళు ఏవి.కుట్టుమిషన్ లు ఎక్కడున్నాయి.దొడ్డిదారిలో ఏ ఏ యూ నిట్లు తరలిపోయాయి. నాలుగేళ్లుగా పంపిణీకి దూరంగా ఎందుకున్నాయి.కొన్ని కుట్టు మిషన్ లు దెందులూరు మార్కెట్ కమిటీ లో ఎందుకున్నాయి.

* చిత్తూర్ జిల్లా యువకుడి దారుణ హత్య.యువకుడి శరీరంను రెండు ముక్కలు చేసి.. సగం పడేసిన దుండగులు.కుప్పం – కృష్ణగిరి జాతీయ రహదారిలోని కుప్పం మండలం నడుమూరు సమీపంలోని బ్రిడ్జి కింద లగేజ్ బ్యాగ్ లో యువకుడి శరీర భాగం.యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు అతి కిరాతకంగా శరీరాన్ని రెండు ముక్కలు చేసి నడుము కింది భాగాన్ని ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి లగేజ్ బ్యాగ్ లో ప్యాక్ చేసి పడేసిన ఘటన కుప్పంలో కలకలం రేపుతోంది.కుప్పం – క్రిష్ణగిరి జాతీయ రహదారి లోని నడుమూరు గురుకుల పాఠశాల సమీపంలోని బ్రిడ్జి కింద ఓ లాగేజీ బ్యాగ్ పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.అయితే లగేజ్ బ్యాగ్ తెరిచి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

* వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపుపై పిటిషన్‌ వేసిన ఆళ్ల.నీటి వనరులున్న భూ కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్.విచారణ జరిపిన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.ఈ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం.

* * విశాఖ లో పెందుర్తి మరో దారుణం..ఒకే కుటుంబానికి చెందిన 6 గురు హత్య.జుత్తడాలో ఘటన. హంతకుడు బత్తిన అప్పలరాజు కూతురు పార్వతిని బమ్మిడి విజయ్ కుమార్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకుంటానని చెప్పి బొమ్మిడి విజయ్ కుమార్ మోసం చేయడంతో..2018లో విజయ్ కుమార్ పై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు…బొమ్మడి విజయ్ కుమార్ విజయవాడకు చెందిన ఉషారాణి నీ పెళ్లి చేసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు.బొమ్మిడి విజయ్ కుమార్ ఉషారాణి లకు ముగ్గురు పిల్లలుజుత్తాడ గ్రామంలో బొమ్మిడి విజయ్ కుమార్ తండ్రి బొమ్మిడి రమణ ఒక్కడే నివాసముంటున్నారు.ఎంపీటీసీ ఎన్నికల ఓటు వేయడానికి విజయ్ కుమార్ భార్య ఉషారాణి అత్త,చిన్నత్త జుత్తాడ గ్రామానికి వచ్చి బంధువులు వివాహం ఉండడంతో గ్రామంలోనే ఉండిపోయారు.బమ్మిడి విజయ్ కుమార్ తన పెద్ద కుమారుడు ని తీసుకొని శివాజీపాలెంలో ఉండిపోయాడు.జుత్తాడ గ్రామంలో గుమ్మడి విజయ్ కుమార్ తండ్రి రమణ భార్య ఉషారాణి ఇద్దరు పిల్లలు అత్త, చిన్నత్త ఇంటిలో ఉన్నారు.తెల్లవారుజామున చిన్నత్త బయటికివచ్చి వాకిలి కడుగుతుండగా బత్తిని అప్పలరాజు ఆమెపై కత్తితో దాడి చేసి చంపేసాడు.ఇంట్లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా ఇద్దరు చిన్న పిల్లలను.. విజయ్ కుమార్ భార్య అత్త , తండ్రులను కత్తితో నరికి చంపేశాడు.ఇంటి నుండి బయటకు వచ్చి అరుగుపైన అరగంట సేపు కూర్చొని.. అనంతరం100 కి కాల్ చేయడంతో పెందుర్తి పోలీస్ వచ్చి అరెస్టు చేశారు.