Sports

విశ్వనాధన్ ఆనంద్ తండ్రి మృతి

విశ్వనాధన్ ఆనంద్ తండ్రి మృతి

ప్రపంచ చెస్‌ రారాజు విశ్వనాథన్‌ ఆనంద్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కె.విశ్వనాథన్‌ (92) కన్ను మూశారు. స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సదరన్‌ రైల్వేలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైరైన విశ్వనాథన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదుసార్లు వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచిన తన భర్తకు ఆయన అన్ని విధాలా ఎంతగానో ప్రోత్సాహాన్ని, మద్దతును అందించారని ఆనంద్‌ సతీమణి అరుణ గుర్తుచేసుకున్నారు. ఒక సాధారణ వ్యక్తి తన పిల్లలకు ఉన్నతమైన విలువలు నేర్పారని కొనియాడారు. కొడుకు సాధించిన విజయాలకు గర్వపడ్డారని, తుదిశ్వాస వరకు గర్వించదగిన రైల్వే మ్యాన్‌గానే ఉన్నారంటూ ఆమె తెలిపారు.