Movies

అభిమాని కల నెరవేర్చనున్న కియారా

Kiara Advani To Meet Her Fan

సినిమా తారలకు కొండంత ఉత్సాహం అభిమానులు. ఎంతమంది అభిమానిస్తుంటే అంత ఆనందం వాళ్లకు. ఇప్పుడు సోషల్‌ మీడియా ట్రెండ్‌ నడుస్తోంది కదా. అభిమానులు డైరెక్ట్‌గా సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమాన తారలతో ముచ్చటిస్తున్నారు. తారలూ నిత్యం వాళ్లతో టచ్‌లో ఉంటున్నారు. యువ కథానాయిక కియారా అడ్వాణీకి అభిమానులు బాగానే ఉన్నారు. తాజాగా ఓ అభిమాని మిమ్మల్ని కలవడం నా జీవిత కల అంటూ ట్వీట్‌ చేశాడు. ‘‘కియారా మీరు నాకు ఆదర్శం. మిమ్మల్ని కలవడం నా జీవిత కల. మీరు షూటింగుల కోసం దిల్లీ వచ్చినప్పుడు కలవాలనుకున్నా వీలుకాలేదు. కానీ ఈసారి మిమ్మల్ని కలుస్తాను’’అని ట్వీట్‌ చేశారు. దానికి కియారా స్పందించింది. ‘‘కలలు అతి త్వరలో నెరవేరుతాయి’ అంటూ రిప్లై ఇచ్చింది కియారా. ఆమె అభిమానికి అంత వినమ్రంగా సమాధానం చెప్పడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ‘భూల్‌ భులయ్యా 2’, ‘షేర్షా’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.