తానా 2021 ఎన్నికల్లో ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలో భాగంగా డా.కొడాలి నరేన్ ప్యానెల్ శుక్రవారం నాడు లాస్ఏంజిల్స్లో ప్రవాసులతో సమావేశమై వారి మద్దతును అభ్యర్థించింది. తమను ఎందుకు గెలిపించాలనే దానిపై నరేన్ చేసిన ప్రసంగానికి సభికుల నుండి సంఘీభావం లభించింది. నేడు బే-ఏరియాలో రేపు వర్జీనియాలో ఈయన ప్యానెల్ ప్రచారాన్ని నిర్వహిస్తుంది.
###############