Note: This event has concluded and the press coverage can be seen here – https://www.tnilive.com/2021/04/18/team-kodali-campaigns-in-virginia-2021-tana-elections/
తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాషింగ్టన్ డీసీ-వర్జీనియా-మేరీల్యాండ్(DMV) ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రుడు డా.నరేన్ కొడాలి తన సొంత ఇలాఖాలో నేడు బలప్రదర్శన చేయనున్నారు. గత 15ఏళ్లుగా వర్జీనియాలోని జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్న ఆయన ఈ ప్రాంతంలో సుపరిచితుడు. ఈయన ప్రత్యర్థి నిరంజన్ ప్యానెల్ ఇటీవలే ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన జరిపారు. దీనికి గట్టి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో నరేన్ వర్గీయులు నేటి మధ్యాహ్నం భారీ సభను వర్జీనియాలోని మనాస్సాస్‌లో ఏర్పాటు చేశారు. ఆయన తన ఎన్నికల బాణీని తన సొంతవారికి మరోసారి ఈ సదస్సు ద్వారా గట్టిగా వినిపించనున్నారు.