క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ వికెట్ కోల్పోతామనే భయం లేకుండా ఆడేది ఫ్రీ హిట్. ముందు బాల్ నో బాల్ అయితే ఆ తర్వాత బంతిని ఫ్రీహిట్‌గా పరిగణిస్తున్నారు. సుమారు ఆరేళ్లుగా ఈ రూల్ అమలవుతోంది. 2015లో తొలిసారి ఈ నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టగా, అప్పట్నుంచి అది బ్యాటర్స్‌కు వరంగా మారింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ విమర్శలు గుప్పించాడు. అసలు నో బాల్‌కు ఫ్రీ హిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అసలే బ్యాట్స్‌మన్ గేమ్‌గా మారిపోయిన క్రికెట్‌లో ఈ నిబంధన ఏమిటని రషీద్ ప్రశ్నిస్తున్నాడు. అదనంగా పరుగు వస్తున్నప్పుడు ఫ్రీ హిట్ అనే నిబంధన అవసరం లేదంటున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రూల్ అని ధ్వజమెత్తాడు.
చెత్త నిబంధనపై పాక్ క్రికెటర్ గరంగరం
Related tags :