Health

ఇండియాలో గంటకు 10వేల కేసులు-TNI బులెటిన్

ఇండియాలో గంటకు 10వేల కేసులు-TNI బులెటిన్

* రాష్ట్రం లో కోవిడ్ కేసుల సంఖ్య 8987. ఈ మధ్య కాలంలో ఇదే అత్యధికం.1. చిత్తూరు 10632. గుంటూరు 12023. తూర్పు గోదావరి 8514. విశాఖపట్నం 6755. అనంతపూర్ 2756. ప్రకాశం 3057. నెల్లూరు 13478. శ్రీకాకుళం 1344

* కరోనా మహమ్మారి ధాటికి యావత్‌ దేశం మరోసారి విలవిల్లాడుతోంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో విరుచుకుపడుతూ వణికిస్తోంది. గత ఆరు రోజులుగా దేశంలో రోజుకు 2లక్షలకు పైనే కొత్త కేసులు బయటపడుతుండటం వైరస్‌ తీవ్రతను కళ్లకు కడుతోంది. దేశంలో గత కొద్ది రోజుల నుంచి సగటున గంటకు 10వేలకు పైనే కొత్త కేసులు.. 60 మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

* ఏపీలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 37,922 నమూనాలను పరీక్షించగా 8,987 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,347, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 99 మందికి వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,76,987కి చేరింది.

* ఏప్రిల్‌ 16న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అధర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్యాగ్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘‘వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిపదార్థాలపై అమెరికా విధించిన ఆంక్షలను తొలగిస్తే ఉత్పత్తిని వేగవంతం చేస్తాము. మీ కార్యనిర్వహణ వర్గానికి వివరాలు మొత్తం తెలుసు’’ అని దానిలో పేర్కొన్నారు. కానీ, అమెరికా నుంచి దీనికి సానుకూల స్పందన రాలేదు. మరోపక్క భారత ప్రభుత్వం దేశంలో టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేసింది. ఈ క్రమంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ ఏడాది ఉత్పత్తి చేయాల్సిన మరో టీకా నోవావాక్స్‌ కొవిడ్‌ టీకాపై ప్రతికూల ప్రభావం పడనుంది. దీనిని ఈ ఏడాది దాదాపు 100 కోట్ల డోసులను ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొంది. సీరం సంస్థ ప్రస్తుతం ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇది కాకుండా అమెరికా కంపెనీ నోవావాక్స్తో అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకాలను కూడా తయారు చేయాల్సి ఉంది. దీనిలో వినియోగించాల్సిన అడ్జువెంట్‌ అమెరికా నుంచి రావాల్సి ఉంది. కానీ, బైడెన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే టీకాల అవసరమైన ముడి పదార్థాలను డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ పరిధిలోకి తీసుకొచ్చి.. ఎగుమతులపై ఆంక్షలు విధించారు. దీంతో అమెరికా కంపెనీలు ముడిపదర్థాల విక్రయంలో స్వదేశానికి తొలి ప్రధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఫలితం సీరం సంస్థకు ముడిపదర్థాలు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.

* తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా బారినపడి ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల పట్టణానికి చెందిన రామచంద్రం(55) అనే వ్యక్తి కుటుంబంలో ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇవాళ కరోనాతో రామచంద్రం చిన్న కుమారుడు సుమన్ (33) మృతి చెందారు. వారం క్రితం రామచంద్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియలు పురపాలక సిబ్బంది సహకారంతో నిర్వహించారు. ఐదు రోజుల క్రితం రామచంద్రం పెద్ద కుమారుడు సునీల్‌ (35) కొవిడ్‌కు బలయ్యారు. చిన్న కుమారుడు సుమన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ వార్డు కౌన్సిలర్ మల్లవ్వ, ఆమె భర్తతో కలిసి పీపీఈ కిట్లు ధరించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామచంద్రం ఇంట్లో ప్రస్తుతం ఆయన పెద్దకుమారుడు సునీల్‌ భార్య, ఇద్దరు పిల్లలు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

* కరోనా సోకి ప్రాణాలతో పోరాడుతున్న 200 మంది రోగులకు ఆక్సిజన్‌ సకాలంలో అందించి వారి ప్రాణాలను కాపాడారు దిల్లీ పోలీసులు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. పశ్చిమ విహార్‌లోని బాలాజీ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. ఉన్న ఆక్సిజన్‌ను కొద్ది గంటలు మాత్రమే రోగులకు అందించే క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హరియాణా, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆసుపత్రికి వస్తున్న ఆక్సిజన్‌ ట్యాంకర్లు సరిహద్దుల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి ట్యాంకర్లను పంపించారు. పోలీసు వాహనాలు ఎస్కార్ట్‌గా వస్తుండగా ట్యాంకర్లు హాస్పిటల్‌ చేరుకున్నాయి. ఈ ఆసుపత్రిలో 235 మంది కొవిడ్‌ రోగులు ఆక్సిజన్‌పై ఉన్నారు. సరైన సమయానికి ట్యాంకర్లు రాకపోయి ఉంటే వీరి పరిస్థితి ప్రమాదంలో పడేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సకాలంలో ట్యాంకర్లు వచ్చేలా సాయం చేసిన దిల్లీ పోలీసులకు ఆసుపత్రి వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి.