DailyDose

బాలికను రేప్ చేసిన టిక్‌టాక్ స్టార్-నేరవార్తలు

బాలికను రేప్ చేసిన టిక్‌టాక్ స్టార్-నేరవార్తలు

* ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనలో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మృతుడిని మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు.చనిపోయిన మావోయిస్టుపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.ఘటనా స్థలం నుంచి 9 ఎంఎం తుపాకి, 3 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు

* విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం.పాతబస్తీ చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేష్(37) కరోనాతో మృతి.ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున దినేష్ తండ్రి మృతి…మూడు రోజుల క్రితం కరోనాతో దినేష్ తల్లి, బాబాయ్ కన్నుమూత.ఒకే కుటుంబంలో కరోనాకు బలైన నలుగురు.

* ఏపీలో దారుణం చోటుచేసుకుంది.ఓ బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్‌ భార్గవ్ ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు.పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.అయితే అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు.అసలు వివరాల్లోకి వెళితే…….హైదరాబాద్ కు చెందిన భార్గవ్ “ఫన్ బాస్కెట్ ” పేరుతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు.టిక్ టాక్ నిషేధించడంతో మోజో, రేపోసో వంటి యాప్ లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడు భార్గవ్.ఈ నేపథ్యంలోనే భార్గవ్ కు పెందుర్తి కి చెందిన ఓ బాలికకు పరిచయమయ్యాడు.ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు భార్గవ్.గర్భవతి కావడంతో ఆమెను దూరం పెట్టాడు భార్గవ్.దీంతో విశాఖ దిశ పోలీసులను ఆశ్రయించింది బాలిక.బాలిక ఫిర్యాదు మేరకు భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

* నూజివీడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ.ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి.7 నెలల క్రితం వెలమ పేటకు చెందిన ఝాన్సీ,రవి ప్రేమ వివాహం.ప్రేమ వివాహాన్ని అంగీకరించని ఇరు కుటుంభ సభ్యులు.నిన్న ఒక వర్గానికి చెందిన మెకానిక్ దుర్గపై మరో వర్గం దాడి.తీవ్ర గాయాలు అయిన దుర్గకు నూజివీడు ఆసుపత్రిలో చికిత్స.ఆసుపత్రి ఆవరణలో మరో మారు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన వైనం.దాడిలో ఆసుపత్రి సామాగ్రి ధ్వంసం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* కృష్ణాజిల్లా ÷నందిగామ పట్టణంలో మధిర చర్చి వద్ద సీఐ కనకారావు వాహనాల తనిఖీలలో భాగంగాఒక ద్విచక్ర వాహనాలు తనిఖీ చేయగా 216 మద్యం బాటిల్స్ తెలంగాణ నుండి ఆంధ్రకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గా గుర్తించారు.ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్న సీఐ కనకారావు.పట్టుబడిన వ్యక్తి చందర్లపాడు పట్టణానికి చెందిన మాదిరాజు సీతారామయ్య గా గుర్తింపు తెలంగాణ రాష్ట్రం మధిర నుండి చందర్లపాడు కు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని సిఐ కనకారావు వెల్లడించారు.