Devotional

ఆకాశగంగ సమీపంలోనే హనుమంతుడు జన్మించాడు

ఆకాశగంగ సమీపంలోనే హనుమంతుడు జన్మించాడు

హనుమంతుడి జన్మస్థానంపై తితిదే అధికారిక ప్రకటన చేసింది. సప్తగిరుల్లోని ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని తెలిపింది. ఈ మేరకు జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఆంజనేయస్వామి జన్మస్థలంపై తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని చెప్పారు. అన్వేషణకు సంబంధించిన ఆధారాలను ఆయన వెల్లడించారు. నాలుగు నెలలుగా ఆధారాలను సేకరించామని చెప్పారు.