NRI-NRT

వైభవంగా తాకా ఉగాది

TACA Ugadi 2021 In Canada

కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఏప్రిల్ 17, 2021 శనివారం నాడు ప్లవ నామ సంవత్సర ఉగాది సంబరాలను అంతర్జాలంలో అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమును 500 మంది పైగా కెనడా లో ని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి , వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

మొదటగా తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి కుటుంబం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాల ను ప్రారంభించారు. పిమ్మట కెనడా మరియు భారత దేశ జాతీయ గీతాలను ఆలపించడం జరిగింది. టొరంటో లో వున్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చదివి, కొత్త సంవత్సర రాశి ఫలితాలను అందరికి వివారించారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి కోవిద్-19 కష్ట కాలంలో తాకా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు.

తాకా వ్యవస్థాపక చైర్మన్ చారి సామంతపూడి కెనడా లో తెలుగు వారందిరికి ఎన్నో సేవలు అందిస్తున్న అల్బెర్టా మంత్రి పాండా ప్రసాద్ కి, సన్ డైన్ అధినేత శ్రీధర్ ముండ్లూరు కి, టొరంటో తెలుగు టైమ్స్ అధినేత సర్దార్ ఖాన్ కి ఉగాది పురస్కారాలను ప్రకటించి వారి సేవలను కొనియాడారు.

మన తెలుగు చలన చిత్ర గాయకుడు దినకర్ కల్వల ఎన్నో మంచి పాత మరియు కొత్త తెలుగు సమ్మేళన పాటలను పాడి కార్యక్రమము లో పాల్గొన్న వారందిరిని అలరించారు. తరువాత చిరంజీవులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల, శ్రిష్టి దామెరశెట్టి, తారుణి దేసు,మేధా గేదెల, వత్స సంక ,శ్లోక కేశర్వాణి, అజయ్ అనమంగండ్ల, సంయుత గందె, సాయిపులివర్తి, సహస్ర కోట, వైభవ్య కుప్పం, హరిలౌక్య కుప్పం, రోహన్ ముటుపూరుల పాటలు, నృత్యాలు అందరిని ఎంతో ఉత్తేజపరిచాయి.

ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల మరియు ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామ చంద్రరావు దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని, మరియు ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, లోకేష్ చిల్లకూరు, మునాఫ్ అబ్దుల్ ను తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అభినందించారు.

చివరిగా ట్రస్టీ చైర్మన్ బాషా షేక్ కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికి, దాతలకు, అతిధులకు ఇఛ్చిన వందన సమర్పణతో కార్యక్రమము జయప్రదంగా ముగిసింది.