* తెలంగాణలో కొత్తగా 5567 కేసులు, 23 మంది మృతి. తెలంగాణలో మొత్తం 3.73 లక్షలు దాటిన కేసులు.. తెలంగాణలో మొత్తం 1899 కరోనా మరణాలు
* దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై మంత్రి కేటీఆర్ ఈ ఉదయం ట్వీట్ చేశారు. ‘‘ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్లకు 2 ధరలు చూస్తున్నాం. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 టీకా అంటున్నారు. అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్ నిధి నుంచి భరించలేదా? దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?ఒకే దేశం- ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించాం’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
* సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. తమ సిబ్బందికి కరోనా వచ్చిందని ముగ్గురు న్యాయమూర్తులు వెల్లడించారు.
* రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
* సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
* కరోనా నుంచి రక్షణ పొందేందుకు టీకా తీసుకుంటున్నప్పటికీ పలువురు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో వ్యాక్సిన్ సమర్థతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. టీకా తీసుకున్నాక కూడా వైరస్ బారిన పడినట్లయితే ఇక టీకా తీసుకుని లాభమేంటన్న భావన ప్రజల్లో నెలకొంటోంది. దీంతో కొందరు టీకా తీసుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలకమైన డేటాను విడుదల చేసింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారు స్వల్ప సంఖ్యలోనే వైరస్ బారిన పడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ్ బుధవారం సంబంధిత డేటాను విడుదల చేశారు.
* కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి
* టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు అని స్పష్టం చేశారు. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఒక వేళ బయటకు వెళ్లాలనుకుంటే దయచేసి తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఎంపీ సంతోష్ కుమార్ సూచించారు.
* జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దంత వైద్యుడిగా పనిచేస్తున్న ముప్పన సతీష్‌కుమార్ (45) బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. సీహెచ్‌సీ సిబ్బంది సమాచారం మేరకు ఐదు రోజుల క్రితం కరోనా లక్షణాలతో సతీష్‌కుమార్ రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం నుంచి ఆరోగ్యం విషమించింది. సాయింత్రం 4గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే వెంటనే జగ్గంపేట సీహెచ్‌సీలో విషాదం నెలకొంది.