* తమను అణచివేసే లక్ష్యంతో భద్రత బలగాలు తొలిసారిగా డ్రోన్‌తో బాంబులు వేశాయని మావోయిస్టులు ఆరోపించగా.. దీన్ని పోలీసులు ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప పేరిట మీడియాకు బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. బొత్తలంక, పాలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఈ నెల 19 తెల్లవారుజామున పోలీసులు డ్రోన్‌తో 12 బాంబులను అడవిలో వదిలారని లేఖలో ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. డ్రోన్ సహాయంతో బాంబుల దాడి ఆరోపణల్లో నిజం లేదని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ఖండించారు.
* ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ముగిసిన వాదనలు.జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 27న తీర్పు వెలువరించనున్న కోర్టు.జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 చార్జ్ షీట్లు నమోదు చేసిందని పిటిషనర్ వాదనలు.ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ1గా ఉన్నారని పిటిషనర్ వాదనలు.
* గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీస్ అధికారులను ఆదేశించిన గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని.
* మాజీమంత్రి దేవినేని ఉమా క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.మాజీమంత్రి దేవినేని ఉమాను విచారణ చేయాలి తప్ప అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు.ఈ నెల 29న మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కానున్న మాజీమంత్రి ఉమా.విచారణ లోపు తదుపరి చర్యలు తీసుకోవద్దని సిఐడి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.
* క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న క్రికెట్ బుకీలకు చెక్ పెట్టిన పోలీసులు. కృష్ణాజిల్లా మచిలీపట్నం అమాయక ప్రజలను ఎరగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ రాయులు గుట్టురట్టు 6మంది ప్రధాన బుకీలు 12 మంది సహచర నిర్వాహకులను అరెస్ట్ చేసి 5 ,24, 783/-నగదు 11సెల్ ఫోన్లు ఒక యాపిల్ టాబ్ ఒక కలర్ టీవీ , క్యాలిక్యులటర్ -2,పుస్తకాలు-6 పోలీస్ లు సిజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ ల కు పాల్పడితే చాటప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు తెలిపారు. మచిలీపట్నం పోలీస్ కార్యలయం లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఏస్పీ రవీంద్రనాధ్ బాబు.