తొలిదశ కరోనా నేపథ్యంలో భారత్‌లో 2020లో విధించిన లాక్‌డౌన్ కోట్లాదిమందికి జీవనోపాధి లేకుండా చేసింది. కోట్లాదిమందిని నిరుపేదలుగా మార్చింది. గత ఏడాది తొలిదశ కరోనా, తాజాగా విజృంభిస్తున్న సెకెండ్ వేవ్ ప్రభావం భారత ఆర్థికవ్యవస్థపై చూపిస్తున్న ప్రభావంపై అమెరికా, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థలు అధ్యయనం చేశాయి. గత ఏడాది సంభవించిన వైరస్ వల్ల దేశంలో పేదరికం రెండింతలకు చేరనున్నట్టు అమెరికాకు చెందిన ‘పియో పరిశోధనా కేంద్రం’ జరిపిన అఽధ్యయనంలో వెల్లడించింది. లాక్‌డౌన్ వల్ల జనాభాలో ఎక్కువమంది ఆదాయాలు అనూహ్యంగా తగ్గిపోయాయని తెలిపింది. పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు కూడా బాగా పడిపోయిందని తెలిపింది. ప్రపంచ బ్యాంక్ ఆర్థికాభివృద్ధి అంచనాల ఆధారంగా పియో సంస్థ పరిశోధనలు జరిపింది. కరోనా వల్ల దేశంలో నిరుపేదల సంఖ్య (రోజుకు రూ.150 కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు) 6 కోట్ల నుంచి 13.4 కోట్లకు పెరిగింది. అదే సమయంలో రోజువారీ ఆదాయం రూ.750 నుంచి 1500 ఉన్న మధ్యతరగతి జనాభా 3.2 కోట్లమంది తగ్గారు. కరోనా రాకముందు దేశంలో ఈ ఆదాయవర్గం జనాభా 9.9 కోట్ల మంది ఉంటే గత ఏడాది వైరస్ ఉధృతి కారణంగా వారి జనాభా 6.6కోట్లకు తగ్గింది. కాగా, భారత ఆర్థికవ్యవస్థపై సెకెండ్ వేవ్ ప్రభావం ఊహించినదానికంటే దారుణంగా ఉంటుందని జపాన్‌లోని నోముర రిసెర్చ్ సంస్థ (ఎన్‌ఆర్‌ఐ)కు చెందిన ఆర్థికవేత్తలు హెచ్చరించారు.. తొలిదశ కరోనా ప్రభావానికి దెబ్బతిన్న చిన్న వ్యాపార సంస్థలు, రెండో వేవ్‌తో మరింత నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి. అందరికీ టీకా వేయడంతోపాటు మే నాటికల్లా వైర్‌సను కట్టడిచేయకుంటే దాని ప్రభావం వ్యాపార కార్యకలాపాలపై తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండియాలో రెండింతలు అయిన పేదరికం
Related tags :