Health

భారత్‌లో మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా-TNI బులెటిన్

భారత్‌లో మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా-TNI బులెటిన్

* దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఆందోళనకరంగా మారుతున్నాయి.ఒక్కరోజే 3,32,730 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 2,263 వైరస్​కు బలయ్యారు. 1,93,279 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.మొత్తం కేసులు: 1,62,63,695మొత్తం మరణాలు: 1,86,920మొత్తం కోలుకున్నవారు: 1,36,48,159యాక్టివ్ కేసులు: 24,28,616

* పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది.కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో.. హైదరాబాద్​లోని స్వగృహంలో ఆయన హోమ్ ఐసోలేషన్​లో ఉన్నారు.స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చికిత్స తీసుకుంటున్నారు.గడిచిన రెండు మూడు రోజులుగా తనను వ్యక్తిగతంగా కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.కరోనా కారణంగా ఇవాళ మైక్రోసాఫ్ట్ సంస్థతో నైపుణ్యాభివృద్ది శిక్షణకు సంబంధించి జరగాల్సిన అవగాహన ఒప్పంద కార్యక్రమం వాయిదా పడింది.

* ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి.– మృతుడు లేబర్ డిపార్ట్‌మెంట్ ఎస్‌వో అజయ్‌బాబు.– ఇప్పటివరకు కరోనాతో ఐదుగురు ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి.– ఆందోళనలో ఏపీ సచివాలయ ఉద్యోగులు.– వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతి ఇవ్వాలని డిమాండ్.

* తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది.

* నూజివీడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోవిడ్ టెస్ట్, వ్యాక్సిన్‌లకు ప్రజలు క్యూ కడుతున్నారు. నూజివీడులో కోవిడ్ పాజిటివ్ కేసులు 45కు చేరాయి. ఇప్పటివరకు కరోనా కాటుకు బలై 8 మంది మృతి చెందారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరికొందరు రోగులు మృత్యువుతో పోరాడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి ఇళ్లకే పరిమితమైయ్యారు. భయాందోళనలో పట్టణ ప్రజలు ఉన్నారు. ఈ నెల 26 నుంచి వ్యాపార సంస్థల నిర్వహణ వేళలను కుదించి కరోనా కట్టడికి సహాకరించాలని వ్యాపారస్తులను రెవిన్యూ, పోలీసు అధికారులు కోరారు.