DailyDose

గంగలోకి జీపు-11 మంది గల్లంతు-నేరవార్తలు

Jeep Goes Into Ganga River In Bihar

* 12 మంది కరోనా రోగులు అగ్ని ప్రమాదంలో మరణం.నాసిక్‌లో ఆక్సీజన్ ట్యాంకర్ లీకై 24 మంది మరణించిన ఘటనను మరవక ముందే.. మరో ఘోరం జరిగింది.పాల్‌గఢ్ జిల్లాలోని విరార్‌లో ఓ కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది రోగులు మరణించారు.మరికొందరికి గాయాలయ్యాయి. వారిని వేరొక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.విరార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.ఐతే అర్ధరాత్రి దాటిన తర్వాత ఐసీయూలో మంటలు చెలరేగాయి.

* కృష్ణా జిల్లా÷ కంచికచర్ల పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా జాతీయ రహదారిపై రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న లారీ ని పట్టుకున్న పోలీసులు

* గంగా నదిలోకి దూసుకెళ్లిన జీపు- 10 మంది గల్లంతు.బిహార్‌ పట్నా జిల్లా పీపాపుల్‌ వద్ద ఓ జీపు గంగా నదిలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ఆ వాహనంలో 15 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

* విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై టెండర్లు ఖరారు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో బిల్డ్‌ ఏపీ పేరిట భూముల అమ్మకాలపై ఇచ్చిన స్టే ఉత్తర్వులే.. విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తుందని వెల్లడించింది.విశాఖలో 5 చోట్ల భూముల అమ్మకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. టెండర్లు ఖరారు చేయవద్దంటూ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

* జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణను.. ఈనెల 30కి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. జనసేన, భాజపాలతో పాటు తెదేపా నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యాలు న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది కోరారు. దీంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.