Kids

ఐశ్వర్యం అంటే ఇదే!

ఐశ్వర్యం అంటే ఇదే!

• ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం

• అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం

• భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం

• పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం
.
• వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం

• పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం

• ప్రకృతి అందం ఐశ్వర్యం

• పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం

• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం

• బుద్ధికలిగిన బిడ్డలు ఐశ్వర్యం

• బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం

• పరులకు సాయంచేసే మనసు మన ఐశ్వర్యం

• ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం.
• మనసు పొందే సంతోషం ఐశ్వర్యం.