Health

ఇండియాలో ఒక్కరోజే మూడున్నర లక్షల కేసులు-TNI బులెటిన్

ఇండియాలో ఒక్కరోజే మూడున్నర లక్షల కేసులు-TNI బులెటిన్

* దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజే 3,46,786 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 2,624 వైరస్​కు బలయ్యారు. 2,19,838 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.వరుసగా మూడోరోజూ భారత్​లో 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి.మొత్తం కేసులు: 1,66,10,481.మొత్తం మరణాలు: 1,89,544.మొత్తం కోలుకున్నవారు: 1,38,67,997.యాక్టివ్ కేసులు: 25,52,940.కొవిడ్​ నియంత్రణలో భాగంగా.. మొత్తంగా 13 కోట్ల 83 లక్షల 79 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

* కరోనా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు యథాతథంగా జరపాలని స్పష్టంచేశారు.మెడిసిన్స్​ బ్లాక్‌ మార్కెట్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

* గన్నవరం విమానాశ్రయానికి మరో లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పూణెలోని సీరం ఇన్​స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్​ టీకా డోసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

* దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌లగ్జరీ సర్వీసుల్లో తొలుత 50 శాతం సీట్లు ఆన్‌లైన్‌లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

* కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర కీలక నిర్ణయం.కరోనా వ్యాక్సిన్ ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందించనుంది.కోవాక్సిన్, కోవిషీల్డ్ డోసులను ₹150 లకు కొనుగోలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం.