* పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలం అల్లాంచెర్ల రాజుపాలెం లో ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు దాడి.సర్వే నెంబర్ 226 ఫారెస్ట్ భూమి ని గ్రామస్తులు కొంతమంది వెళ్లి అక్యూఫై చేయగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, మరియు బీట్ ఆఫీసర్ వారి సిబ్బంది తో వెళ్లి ఆపగా కొంత మంది ఆఫీసర్స్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వారు, మురుదుడ్ల సాయి, బండి యేసు, గజ్జల మల్లయ్య అనే వారు.
* రాయదుర్గం పట్టణంలో ఓబులచారి రోడ్డులో శివకుమార్ కిరానా స్టోర్ సిడు గుండె శివ కుమార్ స్/ఒవిరూపాక్ష 6640 గుట్కా పాన్ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు సుమారు 20 వేల రూపాయల విలువ గలదు అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ సీఐ ఎం.వీరన్న, ఎస్ ఐ.రాఘవేంద్ర, సబ్ సీఐ.పవన్ కుమార్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
* పెదకూరపాడు మండలం కంభంపాడు గ్రామంలో గత మూడురోజులుగా అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బంగారుకుంట లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభించి ట్రక్కు 8 వందలనుంచి1000 వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
* యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదా కోసం వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన నాని అలియాస్ మాధవ్ (18), రోహన్(17) ఆదివారం తమ ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై చౌటుప్పల్‌కు వచ్చారు. సరదా కోసం ఇక్కడి లక్కారం చెరువులో ఈతకు దిగారు. అ క్రమంలో ప్రమాదవశాత్తు నాని, రోహన్ చెరువులో పడి మునిగిపోతుండటం గమనించిన ఇతర స్నేహితులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు వచ్చి కాపాడేలోపే యువకులిద్దరూ నీటమునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ శ్రీనివాస్ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
* తిరుపతి కర్నాల వీధిలో ఆర్టీసీకి చెందిన సప్తగిరి బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.