DailyDose

బెజవాడలో బ్లాక్ మార్కెట్‌లో రెమిడిసివర్-నేరవార్తలు

బెజవాడలో బ్లాక్ మార్కెట్‌లో రెమిడిసివర్-నేరవార్తలు

* విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి లో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు..తెలంగాణ నుండి అక్రమంగా గుంటూరుకు తరలిస్తున్న లక్ష నలభై వేల విలువైన 478 మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్న- నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసరావు..ఒక కారు సీజ్,ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపిన-డిఎస్పీ

* బెజవాడలో భారీగా రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ దందా.రెమిడెసివిర్ ఒక్క వైల్‍కు రూ.40-50 వేల వరకు విక్రయిస్తున్న వైనం.రెమిడెసివిర్ ఒక్క వైల్ అసలు ధర రూ.2,240.రెమిడెసివిర్ బ్లాక్‍మార్కెట్ దందాపై ఎన్టీవీ నిఘా .ఆర్‍ఎంపీ వైద్యులే కేంద్రంగా కొనసాగుతున్న దందా.దందాలో మెడికల్ ఏజెంట్లు, ఆస్పత్రి సిబ్బందికీ వాటా .ఆస్పత్రుల పేరుతో తక్కువ ధరకు తీసుకుని.. బ్లాక్‍మార్కెట్‍లో రెమిడెసివిర్‍ను అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు.

* విశాఖలో కరోనా మరణ మృదంగం – శ్మశానవాటికకు క్యూ కడుతున్న కరోనా మృతదేహాలు – మృతదేహాలను కాల్చేందుకు కట్టెల కొరత – గంటల తరబడి అంబులెన్స్‌ల్లోనే ఉండిపోతున్న మృతదేహాలు – మృతదేహాలు కాల్చడానికి కట్టెలకు విపరీతమైన డిమాండ్ – లోడు కట్టెలు రూ.5 వేల నుంచి 7 వేలకు అమ్ముతున్న వైనం – కట్టెలు లేకపోవడంతో పచ్చి కర్రలతోనే దహన సంస్కారాలు – అసంపూర్తిగా కాలిన స్థితిలో కరోనా మృతదేహాలు – ఆందోళనలో శ్మశానవాటిక పరిసర ప్రాంత వాసులు

* ఏపీలోని విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు మృతి చెందారు.మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్ ఆస్పత్రిని పరిశీలించారు.ఆస్పత్రిలో రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్‌ కొరత ఉన్నట్లు సమాచారం.

* ప్రొద్దుటూరులో ముగ్గురి దారుణ హత్య..కుటుంబ కలహాలతో కరిముళ్ల అనే వ్యక్తి కిరాతకంగా చంపిన వైనం..మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు..మృతులు హంతకుని తల్లి, సోదరి, తమ్ముణ్ణి హాతమార్చి పొలీస్ స్టేషన్లో లొంగుబాటు.