* భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చినందుకు అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ పరికకరాల కొనుగోలులో భారత్‌కు మద్దతిస్తామని సత్య నాదెళ్ల వెల్లడించారు. భారత్‌కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ తన వనరులను ఉపయోగిస్తుందని తెలిపారు. భారత్ పరిస్థితిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.
* కరోనా బారిన పడిన వారిలో చాలామంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. వీరిలో యువకులు ఎక్కువగా ఉంటున్నారు.ఇలాంటి వారికి కనీస చికిత్స ఎలా అందించాలన్న దానిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది.వీటి అమలుపై వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతగా దృష్టి సారించడంలేదు.తప్పని పరిస్థితిలో బాధితులు సొంతంగా, కాస్త పరిజ్ఞానం కలిగిన వారి నుంచి సూచనలు పొంది ఔషధాలు వాడుతున్నారు. కొందరు వైద్యులను ఫోన్లలో సంప్రదిస్తున్నారు.
* సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంమాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.సబ్బం హరికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. గత కొన్ని రోజులుగా విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.‘‘ప్రస్తుతం సబ్బంహరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.కొవిడ్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఆయనకు ఉన్నాయి. పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది’’ అని వైద్యులు తెలిపారు.
* కరోనా పై పోరుకు భారత్ కు విదేశాల సహాయం .ఇప్పటికే విస్తృతంగా సాయం ప్రకటించిన పలు దేశాలు .సహాయం ప్రకటించిన వాటిలో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఈ యు, కువైట్ .వ్యాక్సిన్ ముడిపదార్థాల తక్షణమే పంపాలని అమెరికా నిర్ణయం .రాపిడ్ కిట్లు వెంటిలేటర్లు పీపీఏలు పంపించేందుకు అంగీకారం .ఆక్సిజన్ కొరత లేకుండా సహాయం చేస్తామన్న ఫ్రాన్స్ .వైద్య సామాగ్రి అందించేందుకు సిద్ధమైందని ప్రకటించిన చైనా పాక్ .ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు పంపించేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లాండ్ .మెడికల్ ఆక్సిజన్ మందులను భారత్ కు పంపుతున్న ఈ యు .భారత్ కు కరోనా ఎమర్జెన్సీ కిట్లను సిద్ధం చేస్తున్న జర్మనీ.ఇప్పటికే భారత్ కు సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించిన ఇజ్రాయేల్.
* కరోనా సెకండ్ వేవ్ కు ఎన్నికల కమిషనే కారణమన్న హైకోర్టు…అధికారులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదన్న హైకోర్టు….బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన హైకోర్టు…కౌంటింగ్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలి..మే 2న కౌంటింగ్ రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి..లేదంటే ఎన్నికలు రద్దు చేస్తామని మద్రాస్ హైకోర్టు తీవ్ర హెచ్చరిక.