రెండో దశ కరోనా వ్యాప్తి చిన్నారుల్లో ఎక్కువ శాతం కనిపిస్తోంది. 9-15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 1-8 మధ్య వయసున్న వారిలోనూ లక్షణాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది మొదటి దశ కేసుల్లో చిన్నపిల్లలకు 0.5 నుంచి ఒక శాతమే వచ్చింది. ప్రస్తుత కేసుల్లో చిన్నపిల్లలు 2.5% వరకు వైరస్‌బారిన పడినట్టు అంచనాలున్నాయి. కరోనా లక్షణాల్లో నాలుగు వ్యత్యాసాలున్నాయి. ఇందులో సాధారణ (మైల్డ్) జలుబు, పొడి దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటే వైద్యుడి సలహా తీసుకుని తగిన మందులు వాడితే తగ్గుతుంది. తదుపరి జ్వరం రాకుంటే ప్రమాదం ఉండదు. మైల్డ్ దశలో మందులు వాడినా ఫలితం లేకపోవడం, తరచూ జ్వరం రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటే అది మోడరేట్. ఈ దశలో ఉన్నవారి పరిస్థితిని బట్టి కరోనా పాజిటివ్‌గా నమోదైనప్పటికీ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచి వైద్యులు సూచించిన మందులు వాడేలా చూడాలి. ఇతర వ్యాధులున్న చిన్నారులకు కరోనా సోకితే ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోయి 90కి తక్కువ ఆక్సిజన్ లెవెల్స్‌తో సివియర్, క్రిటికల్ దశ కనపడితే.. వారిని తక్షణం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలి. సాధారణ జ్వరం లాంటి లక్షణాలుంటే వైద్యుని సలహా తీసుకుని మందులు వాడాలి. 5 ఏళ్ల లోపు పిల్లలను అనవసరంగా బయటకు తీసుకెళ్తే ఇతర వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అందుకే వైద్యుడిని సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి. వ్యాధి తీవ్రత పెరిగి డొక్కలు ఎగిరేయడం, శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటం వంటివి కనిపిస్తే కరోనా పరీక్షలను చేయించి పాజిటివ్ వస్తే ఆస్పత్రిలో చేర్చాలి. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా చిన్నారులు వేగంగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోమాకు వెళ్లే దశలో ఉన్నవారు మాత్రమే మృత్యువాత పడుతున్నారు. కరోనా సోకిన పెద్దవారితో పోల్చితే పిల్లల్లో మరణాల శాతం తక్కువగా నమోదు కావడం ఊరటనిచ్చే అంశం.
చిన్నారులపై కరోనా రెండో వేవ్ తీవ్ర ప్రభావం
Related tags :