* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ తెలిపారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్ వేయడంతో తాజాగా తన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి, సీబీఐకి నోటీసులు ఇస్తారని రఘురామ పేర్కొన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని ఆయన వెల్లడించారు.
* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులకు బెయిలు మంజూరైంది.
* ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చెయ్యాలని నేను వేసిన పిటీషన్ కు విచారణ అర్హత ఉంది అని ఈ రోజు తీర్పు రావడం జరిగింది.
* ఖమ్మంలో దారుణం: మహిళా చేతులు,మొండెం, తల ముక్కలు చేసి..వివరాల్లోకి వెళితే..రైలు పట్టాలపై అత్యంత దారుణ సంఘటన ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది.డోర్నకల్ గార్ల మధ్య రైలు పట్టాలపై పై ఒక మహిళ కాళ్లు, చేతులు, తల, మొండెం ముక్కలుగా చేసి పడేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సంస్థ ద్వారా ఖమ్మం తరలించారు.మృతురాలి వివరాలు స్వీకరిస్తున్నట్లు ఖమ్మం రైల్వే పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
* అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కరోనా బారిన పడ్డారు. దీంతో చికిత్స కోసం అతనిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ విషయాన్ని తీహార్ జైలు అధికారులు తెలియజేశారు.