నాట్స్ టెంపాబే విభాగం టెంపాలోని రెండు మైళ్ల హైవేను దత్తత తీసుకుంది. ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవే పరిశుభ్రత బాధ్యతను నాట్స్ భుజానికెత్తుకుంది. ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రారంభించారు. 20 మంది నాట్స్ సభ్యులు, స్థానిక ఉండే హైస్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు. నాట్స్ నాయకులు ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది,రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, బిందు సుధ, శ్రీనివాస్ అచ్చి, శ్రీనివాస్ బైరెడ్డి, భాస్కర్ సోమంచి, జగదీష్ తౌతం, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, అనిల్ అరేమండ, విజయ్ కట్టా ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. ఆండ్రెస్ క్వాస్ట్, రోనక్ అగర్వాల్, ఆండీ చెన్, అభయ్ తుంగతుర్తి, సూర్య కార్తికేయన్, విజయలక్ష్మి రిష్విత సి ఆరికట్ల, శ్రీష్ బైరెడ్డి, క్రిష్ తలతి, అంజలి శర్మ, కుషి తలతి తదితరులు వాలంటీర్లుగా వ్యవహరించారు.
హైవే దత్తత తీసుకున్న నాట్స్
Related tags :