* కాస్త తగ్గిన ఉద్ధృతి3.23లక్షల కొత్త కేసులు..2,771 మరణాలువైరస్‌ను జయించివారి సంఖ్య 2.51లక్షలుదిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తోంది.సోమవారం 16,58,700 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,23,144 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా 2,771 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.క్రితం రోజుతో పోల్చుకుంటే కేసులు, మరణాలు కాస్త తగ్గాయి.ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది.ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 16.25 శాతానికి పెరిగింది.మొత్తంగా 28,82,204 మంది కరోనాతో బాధపడుతున్నారు.ఇంత ఉద్ధృతిలోనూ.. రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి.తాజాగా 2,51,827 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
* పది వేలు దాటిన కేసులుహైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 కేసులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది.మరోవైపు మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కొవిడ్‌తో చికిత్స పొందుతూ52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2094కి చేరింది.ఇక తాజాగా 6,446 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,40,590గా ఉంది.రాష్ట్రంలో ప్రస్తుతం 69,221 క్రియాశీల కేసులు ఉన్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,440 కేసులు నమోదయ్యాయి.
* తమిళనాడులో స్టెరిలైట్ పరిశ్రమ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని వేదాంత సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.
* హైదరాబాద్ నుంచి గన్నవరానికి లక్ష కొవాగ్జిన్ టీకాలు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
* కరోనా వైరస్ ప్రజల ప్రాణాలనే కాదు వారి మానసిక స్థితిని కూడా దెబ్బతీస్తోంది.దీనికి యూపీలోని రామ్‌పూర్‌లో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది.వివరాల్లోకి వెళితే రామ్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్, నర్స్ మధ్య వివాదం చోటుచేసుకుంది. అది పరస్పరం దాడి చేసుకునేవరకూ దారితీసిందిఆసుపత్రికి వచ్చిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రికి కరోనా బాధితుల తాకిడి ఎక్కువైంది.ఫలితంగా వైద్యులు, నర్సుల మధ్య ఏదోఒక విషయమై వివాదాలు తలెత్తేవి.తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటనలో విధులు నిర్వహిస్తున్న ఒక డాక్టర్‌పై నర్సు దాడి చేశారు. వెంటనే సదరు డాక్టర్ కూడా ఆమెపై దాడి చేశారు.ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం ముందుగా నర్సు ఆ డాక్టర్ చెంప పగులగొట్టింది.