* ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో వైసీపీ కార్యకర్తల పై టీడీపీ సర్పంచ్ దాడి.సర్పంచ్ పై ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైసీపీ కార్యకర్తలు.వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు పై హనుమాన్ జంక్షన్ సీఐ డి.వి.రమణకి ఫోన్ చేసిన నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు.ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయని సీఐ డి.వి.రమణ.ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ హనుమాన్ జంక్షన్ సీఐ కార్యాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే.కార్యాలయం వద్ద సీఐ లేకపోవడంతో కార్యాలయం ఎదుట భైఠాయించిన ఎమ్మెల్యే అప్పారావు.
* పెదకాకాని మండలం కొప్పురావూరు లో దారుణం.తన కుమార్తెని ప్రేమించాడు అనే యువకుడు కాళ్లు చేతులు నరికిన తండ్రి బంధువులు.తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వెంకటేష్.చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన వెంకటేష్.
* నంద్యాల పట్టణంలోని మల్దార్ పేట లో విషాదం.ఇద్దరు కుమార్తెలు తో పాటు దంపతులు ఆత్మహత్య.పురుగుల మందు తాగి నలుగురు ఆత్మహత్య.మృతులు. శేఖరు .కళావతి అంజలి(16) .అఖిల(14).ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
* సంగం డైరీ ని ప్రభుత్వ పరిధిలోకి తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాలకమండలి.ప్రభుత్వం విడుదల చేసిన జీవో పై హైకోర్టును ఆశ్రయించిన పాలకమండలి.హైకోర్టులో పిటిషన్ వేసిన సంగం డైరెక్టర్లు.జీవో ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.పిటిషన్ దాఖలు చేసిన డైరెక్టర్లు.నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారన్న పిటిషనర్లు.నేడు పిటిషన్ను విచారణకు స్వీకరించే అవకాశం.
* నరసరావుపేటలో ని పలు ప్రైవేటు వైద్యశాలలపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు.ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్-19 రోగులకు వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు.హాస్పిటల్స్ నందు ఆక్సీజన్ మరియు రెమిడిసీవర్ ఇంజక్షన్ల రికార్డులను పరిశీలించిన అధికారులు.తమ వద్ద నుండి ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధికమొత్తంలో ఫీజులు వసూలుచేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన కోవిడ్ బాధితులు.