Health

ఇండియాలో లాక్‌డౌన్‌కు ఆరోగ్యశాఖ సిఫార్సు-TNI బులెటిన్

ఇండియాలో లాక్‌డౌన్‌కు ఆరోగ్యశాఖ సిఫార్సు-TNI బులెటిన్

* కరోనా మహమ్మారి ధాటికి మరో ప్రముఖుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) కరోనాతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్రను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిసా రీహాబిటేషన్‌ సెంటర్‌లో కరోనాతో చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. చంద్ర పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ కాలనీలోని నివాసానికి తరలించారు.

* కరోనాతో ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల మృత్యువాత. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ గైక్వాడ్. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర కుమార్. బెంగాలీ రచయిత అనీశ్ దేవ్ కొవిడ్‌కు చికిత్స పొందుతూ మృతి.

* దేశవ్యాప్తంగా దాదాపు 150 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉండటంతో మరోమారు లాక్ డౌన్ పెడితేనే పరిస్థితులు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది.

* సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర హోంశాఖ ప్ర‌క‌ట‌న‌

* రాష్ట్రంలో కొవిడ్ టీకాకు భారీ స్పందన లభించడంతో నిల్వలను కూడగడుతున్న ప్రభుత్వం.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మరో 3 లక్షల కొవిడ్ టీకా డోసులు.దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో రాష్ట్రానికి చేరిన పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కొవిషీల్డ్ టీకాలు.అనంతరం రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన వ్యాక్సిన్.

* భారత్​లో కరోనా ప్రళయం సృష్టిస్తుంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 3,79,257 కేసులు వెలుగుచూశాయి.మరో 3,645 మరణాలు సంభవించాయి. కొత్తగా 2,69,507 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.మొత్తం కేసులు: 1,83,76,524మొత్తం మరణాలు: 2,04,832మొత్తం కోలుకున్నారు: 1,50,86,878మొత్తం యాక్టివ్​ కేసులు: 30,84,814కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్​ శరవేగంగా కొనసాగుతుంది.ఇప్పటివరకు 15 కోట్ల 20లకు పైగా టీకాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీట్​ వ్యూహంతో వైరస్​ వ్యాప్తి నియంత్రణకు అధికారులు ప్రయత్నం చేస్తున్నాయి.దీనిలో భాగంగా బుధవారం.. 17,68,190 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 28 కోట్ల 44 లక్షల 71 వేలు దాటింది.