ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకూ ఇక నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తించనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం తూర్పు గోదావరి జిల్లాకు మధ్యలో ఉంటుంది. అక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రాలో యానాం రైతులకు YSR భరోసా పథకం
Related tags :