Health

భారత్‌లో కరోనా కరాళ నృత్యం-రోజుకి 4లక్షల కేసులు-TNI బులెటిన్

TNI COVID Bulletin - Daily COVID Cases In India Is Close To 4Lakhs

* కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయానికి యావత్ భారతావని చిగురుటాకులా వణికిపోతోంది. చాపకింద నీరులా దేశం నలుమూలలకు విస్తరించిన కొవిడ్‌.. లక్షల మందిపై ప్రతాపం చూపిస్తోంది. నిత్యం వేల మందిని బలితీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలు వైరస్‌ ఉద్ధృతిని కళ్లకు కడుతున్నాయి. తాజాగా మరో 3.86లక్షల మంది కొవిడ్‌ బారినపడగా.. వరుసగా మూడో రోజు 3వేల మందికి పైనే మృత్యువాతపడ్డారు.

* తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ వినియోగం… అనుమతించిన డీజీసీఏ.వ్యాక్సిన్ పంపిణీకి వినూత్న చర్యలు .డ్రోన్ వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు .తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించింది. దీనికి డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతి కూడా లభించింది. డ్రోన్ల వినియోగంపై డీజీసీఏ అనుమతి ఏడాది పాటు అమల్లో ఉండనుంది.

* కరోనాతో సతమతం అవుతున్న భారత్‌కు.. అమెరికా నుంచి ఔషధాలు, ఆక్సిజన్ ఉత్పత్తి ఉపకరణాలు, మెడికల్ పరికరాలతో తొలి విమానం దిల్లీకి చేరుకుంది.

* కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా బిహార్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్​కుమార్​ సింగ్​ మృతి చెందారు.

* గుంటూరు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగం అందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వివేక్ తెలిపారు

* కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే పోలీసులు కేసులు పెడతారా…? ఇకపై సహించం… సుప్రీంకోర్టు. ఇకపై ఎవరైనా వేధిస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా భావిస్తామని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది.

* నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా వైరస్ విలయతాండవం.ఇప్పటికే పలువురికి కరోనా వైరస్ రావడంతో కొందరు విద్యార్థులు ఇంటికి పంపించిన ట్రిపుల్ ఐటీ అధికారులు

* కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విశాఖ వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.