Health

ఇండియాలో 28కోట్లకు పైగా కోవిద్ టెస్తులు-TNI బులెటిన్

ఇండియాలో 28కోట్లకు పైగా కోవిద్ టెస్తులు-TNI బులెటిన్

* దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.ఆందోళనకర స్థాయిలో కొత్తగా 4,01,993 కేసులు వెలుగుచూశాయి.వైరస్​ బారినపడిన వారిలో మరో 3,523 మంది చనిపోయారు.మొత్తం కేసులు: 1,91,64,969.మొత్తం మరణాలు: 2,11,853.మొత్తం కోలుకున్నవారు: 1,56,84,406.యాక్టివ్ కేసులు: 32,68,710.కొవిడ్ సోకిన వారిలో 2,99,988 మంది కోలుకున్నారు.దేశవ్యాప్త రికవరీ రేటు 81.84 శాతానికి పడిపోగా మరణాల రేటు 1.11 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దేశవ్యాప్తంగా శుక్రవారం 19.45 లక్షల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది.దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 28 కోట్ల 83 లక్షలు దాటింది.కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 15.49 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

* కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఫలితాలను 24 గంటల్లోనే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారీగా టెస్టుల సంఖ్య పెంచాం. పది రోజుల్లోనే 30 వేల నుంచి 80 వేలకు పెంచాం – ఆళ్ల నాని, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

* గుజరాత్‌ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది.కరోనా బాధితులు చికిత్స పొందుతున్న భరూచ్‌లోని పటేల్ వెల్ఫేర్‌ కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది.శుక్రవారం అర్ధరాత్రి తర్వాత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు.

* కరోనా టీకాల కొరతతో సతమతమవుతున్న భారత్​కు కాస్త ఉపశమనం లభించనుంది.రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు శనివారం దేశానికి రానున్నాయి.

* తాడిపత్రి డిప్యూటీ తహసిల్దార్ పరుచూరి వెంకటేష్ (39) కరోనాతో చనిపోయారు.

* కరోనా రెండో డోసు తీసుకోవడం కొన్ని వారాలు ఆలస్యమైతే పనిచేయదన్న అపోహలు వద్దని, ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు.