Sports

IPL2021: దంచికొట్టిన పొలార్డ్

IPL2021: దంచికొట్టిన పొలార్డ్

ముంబయి అదరగొట్టింది. బాదుడు పోటీలో పైచేయి సాధించింది. పొలార్డ్‌ (87 నాటౌట్‌; 34 బంతుల్లో 6×4, 8×6) సంచలన హిట్టింగ్‌తో శనివారం పరుగుల వరద పారిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. అంబటి రాయుడు (72 నాటౌట్‌; 27 బంతుల్లో 4×4, 7×6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో 5×4, 5×6), డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 4×6) విధ్వంసం సృష్టించడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. పొలార్డ్‌తో పాటు రోహిత్‌ శర్మ (35; 24 బంతుల్లో 4×4, 1×6), డికాక్‌ (38; 28 బంతుల్లో 4×4, 1×6), కృనాల్‌ పాండ్య (32; 23 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. ఈ టోర్నీలో చెన్నైకి ఇది రెండో ఓటమి మాత్రమే.