మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రెండోసారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో శుక్రవారమే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్‌లోని నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, తనకెలాంటి ఇబ్బంది లేదని మంత్రి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా తనను కలిసిన నాయకులు, కార్యకర్తలు స్తుముంద జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. తొలిదశ కరోనా వ్యాప్తి సమయంలోనూ మంత్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 15 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో గడిపిన ఆయన కోలుకున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో పువ్వాడ అందుబాటులో ఉండే పరిస్థితి లేకపోవడంతో తెరాస నేతలు, పార్టీ అభ్యర్థుల్లో హైరానా మొదలైంది.
పువ్వాడపై రెండోసారి దాడి చేసిన కోవిద్
Related tags :