60 ఏళ్లు దాటాక తుపాకీ పట్టి.. జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టి.. ‘‘షూటర్ దాది’’గా పేరు తెచ్చుకున్న వెటరన్ షూటర్ చంద్రో తోమర్ ఇక లేదు. 15 ఏళ్లకే పెళ్లి చేసుకుని.. జీవితంలో ఎన్నో సమస్యలను దాటి.. వయసు మీద పడ్డాక షూటర్‌గా కొత్త ప్రస్థానాన్ని మొదలెట్టిన ఆమె స్ఫూర్తి ప్రయాణానికి కరోనా మహమ్మారి ముగింపు పలికింది. ప్రాణాంతక వైరస్‌తో పోరాడిన 89 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ షూటర్ బామ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఆమె తనను విడిచి వెళ్లిపోయిందని చంద్రో మరదలు ప్రకాశి తోమర్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. చంద్రో స్ఫూర్తితో తుపాకీ పట్టిన 84 ఏళ్ల ప్రకాశి కూడా వెటరన్ షూటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ వయస్సు కలిగిన మహిళా షార్ప్ షూటర్‌గా నిలిచిన చంద్రో జీవిత కథ ఆధారంగా ‘‘సాండ్ కి ఆంఖ్’’ పేరుతో బాలీవుడ్‌లో సినిమా కూడా వచ్చింది.
షూటర్ బామ్మ ఇకలేరు
Related tags :