తానా 2021 ఎన్నికల్లో బ్యాలెట్ల విషయంలో ఏర్పడిన సందిగ్ధత, ఆలస్యం ఎట్టకేలకు తెరిపిన పడింది. బోర్డుకు తెలిపిన విధంగా తానా 2021 ఎన్నికల కమిటీ శుక్రవారం నాడు బ్యాలెట్ల ప్రక్రియను పూర్తి చేసి USPS తపాలా శాఖకు బదిలీ చేసినట్లు ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కనకంబాబు ఐనంపూడి పోటీదారులకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. అధ్యక్ష అభ్యర్థులు డా.నరేన్ కొడాలి, నిరంజన్ శృంగవరపు, గోగినేని శ్రీనివాసలు అంతర్జాలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సియాటెల్‌కు చెందిన ఎలక్షన్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన బ్యాలెట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం వీటిని తపాలా శాఖకు బదిలీ చేశారు. వచ్చే వారం అమెరికా-కెనడాల్లోని తానా సభ్యులకు ఈ బ్యాలెట్లు అందే అవకాశాలు ఉన్నాయి. బ్యాలెట్ల ప్రక్రియ ఆశించిన విధంగా సకాలంలో పూర్తి చేసిన కనకంబాబు, ముత్యాల రాజా, కోనేరు ఆంజనేయులులకు బోర్డు ఛైర్మన్ కోయా హరీష్ ధన్యవాదాలు తెలిపారు.
#########
తానా బ్యాలెట్ల ప్రక్రియ సంపూర్తి. తపాలా శాఖకు అందజేత.
Related tags :