కుక్కని తప్పించ బోయి బైక్ కంట్రోల్ తప్పి సైడు ఉన్న కాలువలో పడ్డాడు శ్రీనివాస్…
కష్టపడి బైటికి చేరాడు
అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారుఆపి దగ్గర కొచ్చింది.
బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.
లేదు…లేదు…నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు శ్రీనివాస్.
పరవా లేదు!!! రండి.. చెక్ చేస్తా!!! మా ఇల్లుఇక్కడికి చాలా దగ్గర,..” అందామె.
” థేంక్యూ!!! కానీ మా ఆవిడ ఏమనుకుంటుందో….” అన్నాడతను.
“మరోలా అనుకోకండి. నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?” అందామె.
ఆమె చాలా అందంగా వుంది.
శ్రీనివాస్ ‘నో ‘ అనలేక పోయేడు. అయినా అన్నాడు…మా ఆవిడ అస్సలు ఇష్టపడదు…నేనిలా చెయ్యడం.!
అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.
ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. కొద్దిసేపయ్యాక ” మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా..!!!” అన్నాడతను.
సిల్లీగా వుంది మీరుచెప్పేది…అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే
కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు శ్రీనివాస్.
???
నవ్వించే వాడు యోగి…
నవ్వే వాడు భోగి…
నవ్వని వాడు రోగి…”