అమ్మమక్కల్ మున్నేట్ర కళగం పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఓటమి తప్పలేదు. కోవిల్ పట్టి నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. మూడో కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పరాజయం పాలయ్యారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న నామ్ తమిళర్ కట్చి నేత, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ తిరువొత్తియూరు నుంచి ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీ చేసిన మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమలహాసన్ సాయంత్రం వరకు కాస్త మెజారిటీతో ముందుకు సాగారు. ఆ తదుపరి రౌండ్లలో మెజారిటీ తగ్గడంతో ఆయనకు పరాజయం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేశారు. గతంలో డీఎంకే, కాంగ్రెస్‌లలో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని దృష్ట్యా, ఈసారి బీజేపీలో చేరిన ఆమె అతికష్టం మీద సీటు దక్కించుకున్నారు. గెలుపు లక్ష్యంగా థౌజండ్ లైట్స్‌లో శ్రమించినా ఫలితం దక్కలేదు.
కమల్ ఖుష్బూ పరాజయం
Related tags :