సినీ నటుడు నందమూరి తారకరత్న బంధువులపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని సాగర్ సొసైటీ ఫ్లాట్ నంబర్ 35లో విజయవాడకు చెందిన బెజవాడ బాలకృష్ణ(33) అనే తారకరత్న బంధువు అద్దెకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన సోదరుడు ఎం.కృష్ణాత్మ(45) అనే ఈవెంట్ మేనేజర్‌తో కలిసి టీ తాగుతున్నాడు. ఇదే సమయంలో నలుగురు ఆగంతకులు ఉదయం 10.30 గంటల ప్రాతంలో ఇంట్లోకి ప్రవేశించి వీరిద్దరి కళ్లల్లో కారం పొడి చల్లారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. కొద్దిసేపట్లోనే ఆ నలుగురు అక్కడి నుంచి కారులో పరారయ్యారు.
తారకరత్న బంధువుల కళ్లల్లో కారం కొట్టి దాడి
Related tags :