ScienceAndTech

మీ ఏసీతో జాగ్రత్త

Be careful with your AC - Here are some tips

ఏసీ‌ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి.
ఎయిర్‌ కండిషనర్స్‌తో ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వృత్తిరీత్యా ఏసీలో గడపాల్సి వచ్చి వాటి కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంటే ఆ నష్టాలను తెలుసుకుని వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి ఆశించే ప్రయోజనం ఉంటుంది. ఎయిర్‌ కండిషనర్‌తో ప్రయోజనాలివి…
* ఎయిర్‌ కండిషనర్‌ కారణంగా గది ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణం లో ఉంటుంది. ఇలా ఉంచడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనర్థాలూ, అనారోగ్యాల బారిన మనం పడకుండా చూస్తాయవి.
* కొన్ని అధునాతన ఎయిర్‌ కండిషనర్స్‌తో ఉండే కొన్ని ఫిల్టర్స్‌ చాలా సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్‌ పొల్యుటెంట్స్‌) నుంచి మనల్ని కాపాడతాయి.
* బయటి చప్పుళ్లు లోపలికి వినిపించనివ్వకుండా శబ్ద కాలుష్యం నుంచి ఎయిర్‌ కండిషనర్స్‌ మనల్ని కాపాడుతాయి.
***(నష్టాలివి…
* పైన పేర్కొన్న ప్రయోజనాలిచ్చే ఇవే ఎయిర్‌కండిషనర్లతో కొన్ని నష్టాలూ ఉంటాయి. అవి…
* బయటి ఫ్రెష్‌ గాలులు చాలాకాలం పాటు సోకకుండా ఉన్నందున కొందరిలో ఏసీ కారణంగా కార్డియోవాస్కు్కలార్‌ సమస్యలు, శ్వాసకోశ సమస్యలైన ఆస్థమా, పిల్లికూతలు రావచ్చు.
* కొందరిలో ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్‌ వంటి వ్యాధులూ రావచ్చు.
*కొందరిలో అదేపనిగా ఏసీలో ఉన్నవారు నీళ్లు తక్కువగా తాగుతూ ఉండటంతో కిడ్నీలో స్టోన్స్‌ ఏర్పడవచ్చు.
*కొందరిలో చర్మంపై దురదలు, తలనొప్పులు, అలసట వంటివి రావచ్చు.
****తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఎప్పుడూ ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలికి వచ్చి ఫ్రెష్‌ ఎయిర్‌ తీసుకుంటూ ఉండాలి. దానికోసం వాతావరణంలో కాలుష్యం తక్కువగా ఉండే వేళల్లో (సాధారణంగా ఉదయం వేళల్లో) ఆరుబయటికి రావడం మంచిది.
* ఏసీలోని ఫిల్టర్స్‌ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి.
* ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని బిగించాలి.
* ఏసీ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తుంటే (అంటే ఏసీ సరిపడనివాళ్లు) వాటిని వీలైనంతగా అవాయిడ్‌ చేయాలి. లేదా తక్కువగా వాడాలి.