గృహహింస, హత్యలు, ఆత్మహత్యలు, నకిలీ విశ్వవిద్యాలయాల్లో మోసపోయిన విద్యార్థులు, రోడ్డు ప్రమాదాలు, దుర్మరణాలు, అగ్నిప్రమాదాల్లో ముఖ్యమైన దస్తావేజులు కాలిపోవడం, కాన్సులేట్లో అత్యవసరమైన పని, రోడ్డూ ప్రమాదాల్లో మృతి చెందిన వారిని ఇండియా తరలించడం, కోవిద్ సమయంలో ఇండియా టికెట్లు….చిట్టా ఎంత పెద్దదైనా ఆయా దుస్థితిల్లో ఉత్తర అమెరికాలో సాంత్వన చేకూర్చే ఏకైక సాధనం – “తానా టీంస్క్వేర్”. ఉత్తర అమెరికాలో అనివార్య కారణాల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రవాస తెలుగువారికి సాయమందించే సదుద్దేశంతో ప్రముఖ తెలుగు సంస్థ తానా విభాగంగా 2008లో ఏర్పడిన ఈ అనుబంధ శాఖ ఇప్పటి వరకు కొన్ని వేల మందికి అత్యవసరమైన సహాయాన్ని అందజేసింది.
గత రెండేళ్ల కాలంలో అమెరికావ్యాప్తంగా ఉన్న భారత కాన్సులేట్లతో సమన్వయం చెందుతూ వేల కొలది అత్యవసర ఇమ్మిగ్రేషన్ సెవలను ప్రవాసులకు దగ్గర చేయడంతో పాటు, 500కు పైగా రాదారి ప్రమాదాలు, సహజ మరణాల్లో మృతిచెందిన వారిని భారత్ తరలించడం, 2020లో ఇండియాకు వెళ్లాలనుకునే వారికి అత్యవసర విమాన టికెట్లను భారత కాన్సులేట్ల ద్వారా ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా టీం స్క్వేర్ సంస్థ తన సత్తాను చాటుకుందని 2019 నుండి ఈ విభాగానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న తానా సహాయ కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు సైతం తానా టీంస్క్వేర్ నిధులను వెచ్చించి అవసరమైన సేవలందించడంలో ఈ విభాగం చాలా కీలకంగా వ్యవహరించిందని అశోక్ పేర్కొన్నారు. “ఒక్కరికోసం అందరు కలిసి…అందరి కోసం ఒక్కరు నిలిచి” నినాదంతో ఈ బృహత్తర సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఉత్తర అమెరికాలో అత్యవసరమైన అవసరం ఏదైనా ఉంటే తమను సంప్రదిస్తే తమ పరిధి మేర వారికి సాయపడతామని అశోక్ హామీనిచ్చారు.
తానా ఎన్నికల జరుగుతున్న సందర్భంగా బ్యాలెట్లు అందుకున్న సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని – టీంస్క్వేర్ లాంటి విస్తృత ప్రయోజనాలు అందించే మరిన్ని సమాజహిత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆయా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు కృషి చేసే వారిని విజ్ఞతతో ఎన్నుకున్నప్పుడే – వారి సభ్యత్వాలకు, ఓట్లకు నిజమైన విలువ.
More Info About Team Square Can Be Seen Here
###############################
ఆపద ఏదైనా…అవసరం ఎంతైనా…మేమున్నామంటున్న “తానా-టీంస్క్వేర్”
Related tags :