మధ్యవయసులో చాలామందికి సరిగ్గా నిద్రపట్టదు. పట్టినా మాటిమాటికీ లేస్తుంటారు. అలాంటివాళ్లకు వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని దాదాపు 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిశీలించి మరీ చెబుతున్నారు బ్రిస్టల్ యూనివర్సిటీ నిపుణులు. మతిమరుపుకీ నిద్రపట్టకపోవడానికి దగ్గరి సంబంధం ఉందట. ఈ నిద్రలేమి అనేది ఆలోచనాశక్తి తగ్గడానికీ ఆల్జీమర్స్‌కీ కూడా దారితీస్తుంది అంటున్నారు. అందుకే ఈ సమస్య తీవ్రతని గుర్తించి సుదీర్ఘకాలం పరిశోధన చేశారట. ఇందుకోసం 35-55 ఏళ్ల వయసున్న వాళ్లను పదివేల మందిని ఎంపికచేసి, వాళ్లలో 50-60 ఏళ్ల మధ్య వయసుకి వచ్చేసరికి 30 శాతం మంది ఆరు గంటలకన్నా తక్కువగా నిద్రపోయారనీ ఆ తరవాతి కాలంలో వాళ్లలో 90 శాతం మంది మతిమరుపుతో బాధపడ్డారనీ గుర్తించారు. దీన్నిబట్టి తక్కువ నిద్ర అనేది నాడీకణాల శక్తి తగ్గిపోతుంది అనడానికి ప్రాథమిక సూచన అనీ, ఆ వయసులోనే దీన్ని పరిష్కరించుకుంటే తరవాత వచ్చేవాటిని అడ్డుకోవచ్చట.
నిద్ర తక్కువైతే మతిమరుపు వస్తుంది
Related tags :