DailyDose

అమరరాజాకు హైకోర్టులో ఊరట-నేరవార్తలు

అమరరాజాకు హైకోర్టులో ఊరట-నేరవార్తలు

* తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీకి జగన్ సర్కార్ పెద్ద షాకిచ్చిన విషయం విదితమే.ఈ ఆదేశాలను అమరరాజా కంపెనీ హైకోర్టులో సవాల్ చేయగా.. గురువారం నాడు కంపెనీకి ఊరట లభించింది.కంపెనీ మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.అంతేకాదు….విద్యుత్ పునరుద్ధరణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.జూన్ 17లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు…..మళ్లీ రిపోర్ట్ ఫైల్ చేయాలని పీసీబీని కూడా హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను జూన్ 28కి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

* విజయనగరం జిల్లా కొమరాడ మండలం పాత కళ్లికోట గ్రామంలో ఏనుగుల బీభత్సం గ్రామానికి చెందిన అల్లాడ అప్పమ్మ(58) మృతి. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పొలానికి కూరగాయలు ఎరడానికి వెళ్ళినప్పుడు ఏనుగు దాడిలో మృతి చెందింది.

* ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహిస్తున్న మద్యం దుకాణం లో పనిచేస్తున్న సిబ్బందిప్రైవేట్ సిబ్బంది 8.6 లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం అయితే మంగళవారం ప్రభుత్వ మద్యం షాపు నెంబరు13192 మద్యం షాపులో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం నుండి తనిఖీలు చేసిన అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని అంతా సక్రమంగా ఉందని చెప్పి చేతులు దులుపుకొని వెళ్లడం విడ్డూరంగా ఉంది అయితే తే.గీ అదికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ సిబ్బంది లేకపోవడం అనుమానాలు కలిగిస్తున్నాయి ఈ విషయమై తనిఖీకి వచ్చిన సీఐ వెంకటేశ్వర్లు అరకొరగా సమాధానం చెప్పి వెళ్లిపోవడం విడ్డూరంగా ఉంది

* ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హోమియో వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు స్థానిక ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వీళ్లంతా డ్రోసెరా 30 అనే ఔషధం తీసుకోగా.. అందులో 91 శాతం నాటుసారా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

* కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని దిల్లీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 335మంది కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 78,780 కరోనా టెస్టులు చేయగా, 19,133మంది కరోనా బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 24.29శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 20,028మంది కరోనా నుంచి కోలుకున్నారు.

* ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని దునుమాడారు. సీఎం జగన్ చేతగాని పాలనను జనమే కాకుండా సొంత పార్టీ నేతలే ఎండగడుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడికి జగన్ సర్కార్ ఏమీ చేయలేదని, పనికిమాలిన పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని, ఈ విషయం సీఎం జగన్‌కు చెబితే, ఎక్కడ కక్షసాధింపులకు దిగుతారో అని ఎవరూ నోరు మెదపట్లేదని లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్ మూర్ఖత్వాన్ని, చేతగాని పాలనను, కరోనా వైఫల్యాన్ని వైసీపీ సీనియర్ నేతలే కుండబద్దలు కొడుతున్నారని విమర్శించారు. ‘‘కరోనా నియంత్రణకి జగన్ ఏం చేశాడు? బొక్క చేశాడు…’’ అంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి మెడలో తొలి గంట గట్టారని లోకేశవ్యాఖ్యానించారు.

* కదిరి ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ హాస్పిటల్ సందర్శన కు వస్తున్న ఎమ్మెల్యే సిద్దారెడ్డి ని గేటు బయటే అడ్డుకున్న సీపీఐ నాయకులు.