కరోనా రెండో దశతో పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలామంది వలస కార్మికులు తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం బాలీవుడ్ నటి సన్నీ లియోని, పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియాతో కలిసి ఉదయ్ ఫౌండేషన్ ద్వారా పదివేల మందికి భోజనాలను అందించేందుకు ముందుకు వచ్చింది. దిల్లీలోని వలస కార్మికులకు ఈ శాకాహార భోజనాన్ని అందించనున్నారు. సన్నీ లియోని స్పందిస్తూ..‘‘మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కరుణ, సంఘీభావంతో ముందుకు నడవాలి. పెటా ఇండియాతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నాం. వారితో కలిసి మరోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి వేలాది వలస కార్మికులకు ప్రొటీన్‌తో కూడిన ఆహారం అవసరం.’’ అని తెలిపింది. సన్నీ 2016లో పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. సన్నీ లియోని బాలీవుడ్‌లో ‘జిస్మ్ 2’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తర్వాత పలు సినిమాల్లో నటించించి అలరించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘షెరో’, ‘రంగీలా’లో నటిస్తోంది. తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న ‘హెలెన్’, కోకా కోలా’వంటి సినిమాల్లో నటిస్తోంది.
కోవిద్ సమయంలో సన్నీ గొప్ప సాయం
Related tags :