* భారతదేశానికి కువైట్ భారీ సహాయం.05/05/2021 న 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, 1200 ఆక్సిజన్ సిలిండర్లు. భారత్ కు పంప్పడం జరిగింది.06/05/2021 న మరో 115 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్, మరో 1400 ఆక్సిజన్ సిలిండర్ లు పంప్పడం జరుగుతుంది.రెండు రోజులక్రితం 40 టన్నుల వైద్య సామాగ్రి కూడ పంపడం జరిగింది.భారత్ నావికాదళం సంబంధించిన రవాణా షిప్ లలో ఈ ఆక్సిజన్ కంటైనర్ లను పంప్పడం జరుగుతుంది.
* రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలలో మార్పులు.నేటి ఉదయం 7 : 30 నుండి 11 : 30 గంటల మధ్య పని చేస్తాయి.కర్ఫ్యూ అమలు దృష్ట్యా పని వేళ్లలో అనివార్యమైన మార్పులు.ప్రకటన జారీ చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీ శేషగిరిబాబు.
* కేరళ రాష్ట్రంలో మే 8 నుంచి 16 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.
* కోవిడ్ బాధితుల ఆక్సిజన్ అవసరాపై గురువారం ఉదయం ఎర్పేడు వద్ద గల శ్రీకృష్ణ ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ ను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డా.గురుమూర్తి, శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, బియ్యపు మధు సూధన రెడ్డి సంయుక్తంగా పరిశీలించారు. శ్రీ కృష్ణ మెడికల్ ఆక్సీజన్ ఫిల్లింగ్ స్టేషన్ ను సందర్శించి సంస్థ ఎం.డి. వేణుగోపాల్ నాయుడు తో చర్చించి, జిల్లాలో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రిలకు సరిపడా అవసరాలు ముందుగానే గుర్తించి సమకూర్చాలని కోరారు.
* తూర్పు భారతంవైపుగా కరోనా మహమ్మారి కోరలు చాస్తూ వెళ్తోందని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది.
* టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్
* రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనిచేసే వేళలో మార్పులు చేశారు.ఉదయం 9.00గంటల నుంచే బ్యాంకులు పనిచేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్‌బీసీ) కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.