Business

మళ్లీ ఇంధన ధరలు పెంచిన మోడీ సర్కార్-వాణిజ్యం

Business News - Modi Govt Hikes Fuel Prices Again

* దేశంలో మ‌ళ్లీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజూ పెట్రో ధ‌ర‌ల‌ను పెంచుతూ దేశీయ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి.దీంతో దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లీట‌ర్‌ పెట్రోల్‌పై 25-28 పైస‌లు, డీజిల్‌పై 30-33 పైస‌ల వ‌ర‌కు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.91.27, డీజిల్‌ రూ.81.73కు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.97.61, డీజిల్‌ రూ.88.82, చెన్నైలో పెట్రోల్‌ రూ.93.15, డీజిల్‌ రూ.86.65, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.41, డీజిల్‌ రూ.84.57కు చేరాయి.బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.30, డీజిల్‌ రూ.86.64కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.89.11కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.65, డీజిల్‌ రూ.90.25గా ఉన్నాయి.

* ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు కుదింపు…ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.కరోనా కారణంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించగా ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇకపై ఉదయం 8 నుంచి 11.30 వరకే పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సెక్రటేరియట్ , HOD లు , జిల్లా కార్యాలయాలు , సబ్ డివిజన్ కార్యాలయాల పనివేళల్లో ఈ మార్పులు చేశారు .మ .12 తర్వాత కార్యాలయాలు పనిచేయాలంటే పాసులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

* ఏపీలో పలు ఆస్పత్రులపై అధికారులు మెరుపు దాడులు చేశారు. 30 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆరు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కడపలోని ఓ ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది రోగులను చేర్చుకోవడం, ఆరోగ్యశ్రీ చికిత్స నిరాకరణ, రెమ్‌డెసివిర్‌ దుర్వినియోగంపై చర్యలు చేపట్టారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాపుల్లో రికార్డులు నిర్వహించకపోవడం వంటి అవకతవకలపైనా కేసులు నమోదు చేశారు. ప్రకృతి వైఫరీత్యాల చట్టం, ఔషధ నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

* దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ వాహన ధరలను పెంచింది. మే 8వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెననీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ధర పెంపు సగటున 1.8శాతం వరకు ఉందని వెల్లడించింది. మోడల్‌ను.. వేరియంట్‌ను బట్టి కొంత మార్పు ఉండొచ్చని చెప్పింది. నేడు కార్లు బుక్‌ చేసుకొన్న వారికి మాత్రం పాత ధరకే అందిస్తామని వెల్లడించింది.