Politics

చంద్రబాబుపై క్రిమినల్ కేసు-నేరవార్తలు

Crime News - Criminal Case Filed On Chandrababu In Kurnool

* చంద్రబాబుపై కర్నూల్ లో క్రిమినల్ కేసు నమోదు.సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని పిర్యాదు.ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు.చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద కేసు..ప్రకృతి వైఫరిత్యాల చట్టం కింద నాన్‌బెయిల్‌ సెక్షన్లు నమోదు.చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రర్‌ చేసిన కర్నూలు పోలీసులు.

* అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగి ప్రాణాలు నిలిపేందుకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్‌ అపోలో ఆసుపత్రికి అంబులెన్స్‌లో బాధితుడిని కేవలం 9 నిమిషాల్లో తరలించారు.

* చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు.గత నెల 29న పారిశ్రామికవేత్త భద్రీ నారాయణ ఇంట్లో చోరీ జరిగింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులు కర్రి సతీశ్‌రెడ్డి, నరేంద్రను అరెస్టు చేశారు.వారి నుంచి రూ.3కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు.. రూ. 10లక్షలు విలువైన విదేశీ కరెన్సీ, రూ. 90వేలు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.

* జగన్ బెయిల్.రద్దు చేయాలన్న రఘురామ కృష్ణ రాజు పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ.కౌంటర్ దాఖలుకు సమయం కోరిన.జగన్, సీబీఐ.విచారణ ఈ నెల 17కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.

* సంగం డైరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.హ్యాకింగ్ కు గురైన సంగం డైరీ సర్వర్లు.రోజువారీ కార్యకలాపాలు డేటా హాక్ చేస్తుండగా పసిగట్టిన సెక్యూరిటీ వింగ్ .అభ్యంతరం వ్యక్తం చేసిన డైరీ సెక్యూరిటీ వింగ్ .తక్షణమే పోలీసులు సోదాలు నిలిపివేయాలంటూ డైరీ సిబ్బంది ధర్నా.

* ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని కోర్టుకు తెలిపిన ఏసీబీ.అమెరికాలో ఉన్న స్టీఫెన్ సన్ కుమార్తె కరోనా వేళ రాలేరన్న ఏసీబీ.స్టీఫెన్ సన్ కుమార్తెను సాక్షిగా తొలగించేందుకు ఏసీబీ కోర్టు అంగీకారం.స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విచారణ ఈనెల 10కి వాయిదా.

* సంగం డైరీ వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురు….సంగం డైరీని ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేసిన హైకోర్ట్…అయితే… సంస్థ ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి అన్న హైకోర్టు.