DailyDose

పుత్తూరులో మనిషిని చంపిన ఏనుగు-నేరవార్తలు

పుత్తూరులో మనిషిని చంపిన ఏనుగు-నేరవార్తలు

* కర్నూలు నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు హత్య.వైసీపీ నేత సత్యంరెడ్డి ఇంటి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా.స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వనందుకే హత్య చేశారని ఆరోపణ.నిడ్జూరులో భారీగా పోలీసుల మోహరింపు.

* పుత్తూరుః చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ 20వ వార్డు కళ్యాణపురం ఎస్టీకాలనీ కి చెందిన టి.చిన్నబ్బ (65) కళ్యాణపురం అడవి ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉంటూ జీవనం సాగించేవాడు.గత రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏనుగు తోటలోనికి ప్రవేశించి కాపలాగా ఉన్న చిన్నబ్బను తొండంతో కొట్టడంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది.దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంతో కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.

* క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. అవ‌స‌రం ఉంటేనే ఈ ఇంజెక్ష‌న్ తీసుకోవాల‌ని సీనియ‌ర్ వైద్యులు ఎంత‌గా సూచిస్తున్నా ప్ర‌జ‌ల తీరు మాత్రం మార‌డంలేదు. దీంతో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆస‌ర‌గా చేసుకుని కొంద‌రు ఈ ఇంజెక్ష‌న్ బ్లాక్ దందా కొన‌సాగిస్తున్నారు. ఇదే కోవ‌లో అమేథిలోని ఓ ద‌వాఖాన వైద్యుడు రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్‌ను అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. దాంతో ఆయ‌న‌ను ఇంఛార్జీ సూప‌రింటెండెంట్ ప‌ద‌వి నుంచి అధికారులు తొల‌గించారు.

* అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు క్వింటాళ్ల పటికను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి మీడియాకు వెల్లడించారు. భారీగా నల్ల బెల్లం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల సమయంలో సిరోల్ ఎస్‌ఐ రాణా ప్రతాప్ తన సిబ్బందితో కాంపల్లి బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.