Politics

యువ వైద్యులకు కేసీఆర్ పిలుపు

యువ వైద్యులకు కేసీఆర్ పిలుపు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మొదటిశ్రేణి యోధులైన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి 50 వేల మంది ఎంబీబీఎస్‌ వైద్యులతో పాటు నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆయన ఆదేశించారు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి వెంటనే దరఖాస్తులు స్వీకరించి నియామకాలు చేపట్టాలన్నారు. వారికి గౌరవ ప్రదమైన రీతిలో వేతనాలు ఇస్తామన్నారు. కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులిస్తామని చెప్పారు. కష్టకాలంలో ప్రజల కోసం సేవచేయడానికి యువవైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగలవారు https://odls.telangana.gov.in/ medicalrecruitment/Home.aspxలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.