* కొంతమంది అజాగ్రత్త, నిర్లక్ష్యము, క్రమశిక్షణా రాహిత్యము వలన రాష్ట్రంలో ఉన్న ప్రజలు రాను రాను కోవిడ్ యొక్క తీవ్ర ప్రభావానికి గురవుచున్నారు. వైరస్ ప్రభావానికి గురయిన వారిలో చాలామంది వ్యక్తులకు వారిలో ఉన్న బలమైన రోగనిరోధక శక్తి వలన వారిలో కోవిడ్ ప్రభావము తక్కువ ఉండి తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటున్నారు. రోగనిరోధకత తక్కువ గల వారు కోవిడ్ వలన బలంగా ప్రభావితము అవుతున్నారు. వీరందరి వలన కోవిడ్ చికిత్స అందించే స్థానిక హాస్పిటల్స్ కు ఏర్పడుతున్న ఒత్తిడిని మరియు ప్రస్తుత COVID-19 పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ చికిత్స అవసరం లేని రోగులను నిరోధించి, అత్యవసర వైద్యం అవసరం గల రోగులను గుర్తించి వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించి వైద్యం వెంటనే అందించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసి అమలు పరచాలని ఆదేశించడం జరిగినది.(ఇన్స్టెంట్ ఆర్డర్ 116)
* ఏపీకి మరో 3లక్షల 60 వేల కొవిడ్ వ్యాక్సిన్ చేరిక.
* మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారినపడ్డారు.
* ఎపి డిజిపి ఆకస్మిక పర్యటన. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండు మాస్కు ధరించాలి, శానిటైజర్ ను ఉపయోగించాలి. అత్యవసర సమయంలో బయటకు వెళ్లినప్పుడు కూడా తప్పక రెండు మాస్క్ లు ధరించాలి, శానిటైజర్ ను ఉపయోగించాలి.