Business

₹15వేలకే ఐఫోన్-వాణిజ్యం

Business News - iPhone For 15000 On FlipKart

* మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌ మీ కోసం అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో మే 10 నుంచి 14 వరకు ఆపిల్ డేస్ పేరిట ప్రత్యేక సేల్‌ జరగనుంది. మీ దగ్గర పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఆపిల్ ఐఫోన్‌ను కేవలం పదిహేను వేలకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

* తెలంగాణ రాష్ట్రం నుంచి రైళ్లలో ఢిల్లీకి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న వారు, 72 గంటల ముందు RT-PCR టెస్టు చేయించుకొని నెగటివ్ వచ్చిన వారు 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నిబంధనలు తెలుసుకొని ఢిల్లీకి వెళ్లండి’ అని SCR ట్వీట్ చేసింది.

* దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 26 పైసలు, డీజిల్​ను లీటర్​కు 34 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.91.53కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.82.06కి పెరిగింది.

* భార‌త్ లాంటి వ‌ర్ధ‌మాన దేశాల్లో యువ‌త పైనే అంద‌రి దృష్టి. అంత‌కు ముందు త‌రంలా కాకుండా యువ‌త‌లో ఇప్పుడు పోటీత‌త్వం, లోక‌జ్ఞానం మెండు. చిన్న వ‌య‌సులోనే ఎక్కువ వేత‌నాలు పొందే దిశ‌గా జీవ‌నాన్ని సాగిస్తున్నారు. అదే విధంగా ఖ‌ర్చు చేయ‌డానికీ ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు. ఏ ప‌ని చేసినా ప‌క్కాగా చేయాల‌నే భావ‌న యువ‌త‌ది. ఆర్థిక విష‌యాల నిర్వ‌హ‌ణ‌కు వ‌చ్చేస‌రికి ఎన్నో విష‌యాల్లో అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారు. ముందుత‌రాల వారితో పోలిస్తే ఎంతో ఆధునికంగా ఆలోచిస్తుంది ఇప్ప‌టి యువ‌త‌. కానీ… ఒక్క విష‌యంలో మాత్రం ఇంకా వెన‌క‌బ‌డే ఉంటున్నారు. అదే ఆరోగ్య బీమా. పెట్టుబ‌డుల విష‌యంలో క్రియాశీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా చాలా మందికి ఆరోగ్య బీమా ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న కానీ, అవి అందించే ప్ర‌యోజ‌నాలు, ఆర్థిక భ‌ద్ర‌త గురించి అంతంత మాత్ర‌మే తెలుసని నిపుణులు అభిప్రాయం. చిన్న వ‌య‌సులోనే యువ‌త ఆరోగ్య బీమా తీసుకోవాల‌నేదానికి అనేక కార‌ణాలున్నాయి. నేటి యువ‌త‌రం జీవ‌న విధానం నాసిర‌కంగా ఉండ‌టంతో ఒత్తిడి, వెన్ను నొప్పి, కంటి స‌మ‌స్య‌లను చిన్న వ‌య‌సులోనే కొనితెచ్చుకుంటున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని మానేయ‌డం లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారింది. వైద్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌డానికి జంక్ ఫుడ్ సైతం ఓ కార‌ణంగా మారింది. ఆరోగ్యక‌ర జీవ‌న విధానం క‌న్నా సాటివారితో పోల్చుకొని ఎంత సంపాదిస్తున్నాం.. అనే దానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇలా విప‌రీత‌మైన జీవ‌న ఒత్తిడి వ‌ల్ల వైద్య‌ప‌ర‌మైన క్లిష్ట‌త‌లు చిన్న వ‌య‌సులోనే వ‌స్తున్నాయి. వైద్య‌ప‌ర‌మైన ఇబ్బందులు అనుకోకుండా ద‌రిచేరి జీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేసేస్తున్నాయి. అందుకే ఓ మంచి ఆరోగ్య పాల‌సీ కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఆర్థిక ప‌రంగానైనా వైద్య సంక్లిష్ట‌త‌ల‌తో పోరాడ‌వ‌చ్చు. చిన్న వ‌య‌సులో మొద‌లుపెడితే…పెద్ద‌వాళ్ల‌తో పోలిస్తే యువ‌త అనారోగ్యాల‌కు అంత తొంద‌ర‌గా గురికారు. అలాగ‌ని పాల‌సీ తీసుకోకుండా మాత్రం ఉండకూడ‌దు అంటున్నారు నిపుణులు. చిన్న వ‌య‌సులో పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల్ల ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధులుంటే వాటికి వ‌ర్తించే వెయిటింగ్ పీరియ‌డ్‌ను దాటేందుకు త‌గిన స‌మ‌యం ల‌భిస్తుంది. ఆ త‌ర్వాతి ద‌శ‌ల్లో స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజీ అందేందుకు అవ‌కాశం దొరుకుతుంది. ఆరోగ్య బీమా పాల‌సీకి వ‌ర్తించే నో క్లెయిం బోన‌స్‌ ఏళ్లు గ‌డిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అంతే కాదు చిన్న వ‌య‌సులో ఆరోగ్య పాల‌సీ తీసుకుంటే ప్రీమియం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయి. మామూలుగా బీమా సంస్థ‌లు యుక్త వ‌య‌సువారికి త‌క్కువ ధ‌ర‌లోనే పాల‌సీని ఇస్తుంటాయి. అలా వారితో అనుబంధం కొన‌సాగించ‌డం వ‌ల్ల ఆ త‌ర్వాత కూడా త‌క్కువ ప్రీమియంకే పాల‌సీ రెన్యూవ‌ల్ చేసే వీలు క‌ల్పిస్తారు. పెద్ద‌వారు అనారోగ్య బారినప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. అందుకే చిన్న వ‌య‌సులోనే పాల‌సీ తీసుకోమ‌ని ఆరోగ్య బీమా సంస్థ‌లు ప్రోత్స‌హిస్తాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాల పరంపర కొనసాగించింది. సోమవారం సెన్సెక్స్‌ 295 పాయింట్లు లాభపడి 49,502 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు ఎగబాకి 14,942 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.35 వద్ద నిలిచింది.

* స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లు గత వారం దూసుకెళ్లాయి. విదేశీ పెట్టుబడులు కొంతమేరకు మార్కెట్లకు జోష్ ఇచ్చాయి. ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్లు విదిస్తున్న కారణంగా కరోనా త్వరలో తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. రాబోయే 2 నెలల పాటు కరోనా కేసులు ఇలాగే ఉండి ఆ తర్వాత తగ్గుతాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అందువల్ల ఈ స్వల్ప కాలంలో బంగారంపై పెట్టుబడి పెడితే కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగల కొనుగోళ్లు కాస్త పెరిగాయి. అందుకే బంగారం ధరలు కూడా దూసుకుపోతున్నాయి.