నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోందా? ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చనుందా? లాక్‌డౌన్ తరహా ఆంక్షలతో ఉదయం కూడా కర్ఫ్యూని అమలు చేస్తారా? ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ ఇదే. మంగళవారం తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుండటంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. నేటి మధ్యాహ్నం 2గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు, లాక్‌డౌన్‌పైనా చర్చించనున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయన్న అంశాలపైనా చర్చిస్తారు. తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని ఇప్పటికే అనేకమార్లు ప్రభుత్వ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌పై ప్రభుత్వ వర్గాల్లోనూ భిన్నాప్రాయాలు ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం కావడం గమనార్హం.
తెలంగాణాలో లాక్‌డౌన్‌పై నేడు మంత్రివర్గ చర్చ
Related tags :